24 June, 2026 | 2:00 AM

రైతు వేదికల్లో విత్తన మేళాలు

24-06-2026 12:53 AM

కల్లూరులో రైతులకు సమగ్ర అవగాహన

కల్లూరు, జూన్ 23 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జూన్ 23 నుండి 30వ తేదీ వరకు రాష్ట్రంలోని ప్రతి రైతు వేదికలో విత్తన మేళాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో, కల్లూరు మండల రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమం,విత్తన మేళా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులకు పలు కీలక అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. రైతులకు నకిలీ (స్పూరియస్) విత్తనాల వల్ల కలిగే నష్టాలు,వాటిని గుర్తించే పద్ధతులు, సాగుకు అనువైన సన్న వడ్ల రకాలు గురించి వివరించారు.

అలాగే నానో యూరియా, నానో డి.ఏ.పీ. వినియోగం ద్వారా పంటల దిగుబడి పెంపు, ఖర్చుల తగ్గింపు వంటి ప్రయోజనాలను తెలియజేశారు. విత్తన మేళాలో సన్న వడ్ల విత్తనాలు, పప్పు దినుసులు,నూనె గింజలు, కూరగాయల విత్తనాలతో పాటు నానో యూరియా, నానో డి.ఏ.పీ. రైతులకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నాణ్యమైన విత్తనాలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ భాగం నీరజ, మండల వ్యవసాయ అధికారి రూపా, మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పసుమర్తి చంద్రరావు, మండల పార్టీ అధ్యక్షుడు పొట్రూ అర్జున్రావు, టౌన్ అధ్యక్షుడు ఉస్మాన్, ఏఈఓలు చండ్రుపట్ల, మున్సిపాలిటీ కౌన్సిలర్లు కల్లూరు రైతులు తదితరులు పాల్గొన్నారు.