26 May, 2026 | 4:22 PM

Breaking News

ప్రభుత్వ ఏర్పడ్డ రెండు సంవత్సరాలకె ఆడ బిడ్డలు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడినది   •   బాల్యవివాహాలను నిర్మూలించాలి   •   మంథనిలో రేపు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం విజయవంతం చేయాలి   •   కొనుగోలు కేంద్రం ప్రారంభించిన తాసిల్దార్   •   వర్షాకాలం ప్రారంభంలోగా పనులు పూర్తి చేయాలి   •   కోమాలో ఉన్న లాలును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే తాటి   •   క్యాన్సర్ ను ప్రారంభ దశలో గుర్తించి శస్త్రచికిత్స చేస్తే.. ప్రమాదాలు తగ్గించవచ్చు..   •   పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెంచాలి: సీఐటీయూ   •   గుడిసె వాసుల జాబితాను సిద్ధం చేయండి: ఎంపీడీవో   •   వైభవంగా అయ్యప్ప స్వామి పుట్టినరోజు వేడుకలు   •  

వాస్తవికతకు దగ్గరగా మదం

28-12-2025 12:32 AM

ఏకైవా హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సూర్యదేవర రవీంద్రనాథ్, రమేశ్‌బాబు కోయ నిర్మించిన చిత్రం ‘మదం’. హర్ష గంగవరపు, ఇనాయ సుల్తానా, అనురూప్, లతారెడ్డి కీలక పాత్రలు పోషించారు. బలమైన భావోద్వేగాలతో సాగే ఈ హార్డ్ -హిట్టింగ్ డ్రామా చిత్రం ఇదని చిత్రబృందం పేర్కొంటోంది. నూతన సంవత్సరం కానుకగా ఈ చిత్రం జనవరి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో చిత్రబృందం పాల్గొన్నారు.

రాజీ లేని కథనంతో, వాస్తవికతకు దగ్గరగా ఈ సినిమాను రూపొందించినట్లు ఈ సందర్భంగా నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి కథ, మాటలను నిర్మాత రమేశ్ బాబు కోయ అందించగా, వంశీ మల్లా దర్శకత్వం వహించారు. ‘ఈగల్’ ఫేమ్ డేవ్జాండ్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. నందమూరి తారకరామారావు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించగా, రవి వీ సినిమాటోగ్రఫీ అందించారు.