28-12-2025 12:26:43 AM
కరుణాడ చక్రవర్తి శివరాజ్‌కుమార్, రియల్ స్టార్ ఉపేంద్ర, రాజ్ బిశెట్టి వంటి స్టార్‌లతో అర్జున్ జన్య తెరకెక్కించిన చిత్రం ‘45 ది మూవీ’. సూరజ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఉమారమేశ్‌రెడ్డి, ఎం రమేశ్‌రెడ్డి నిర్మించారు. మైత్రి ద్వారా తెలుగులో జనవరి 1న ఈ సినిమాను రిలీజ్ కానుంది. ఈ క్రమంలో శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. శివరాజ్‌కుమార్ మాట్లాడుతూ.. “ఈ మూవీని చూస్తే కచ్చితంగా ప్రతి ఒక్క ప్రాణిని ప్రేమిస్తారు.. గౌరవిస్తారు. ఎన్ని రోజులు భూమ్మీద బతుకుతామో తెలీదు.. బతికినన్ని రోజులు సంతోషంగా బతకాలని ఈ మూవీ చెబుతుంది” అన్నారు.
ఉపేంద్ర మాట్లాడుతూ.. “ఈ మూవీ తర్వాత అర్జున్ పెద్ద దర్శకుడిగా మారిపోతారు. నాకు ఇంత వరకు ఎవ్వరూ ఇవ్వని పాత్రను చాలా డేరింగ్‌గా అర్జున్ నాకు ఇచ్చారు. ఆయన్ను చూస్తే సౌమ్యంగా ఉంటారు.. కానీ తెరపై మాత్రం విధ్వంసం సృష్టించారు” అని చెప్పారు. ‘45’ మూవీలో ఓ కొత్త ప్రపంచాన్ని చూడబోతోన్నార’ని దర్శకుడు అర్జున్ జన్యా అన్నారు. నిర్మాత రమేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. “గరుడ పురాణం గురించి చాలా గొప్పగా చెప్పే చిత్రమిది” అని తెలిపారు. మైత్రి శశి మాట్లాడుతూ.. “మంచి సందేశాన్నిచ్చేలా ఈ చిత్రం ఉంటుంది. ప్రస్తుత తరం ఈ సినిమాను కచ్చితంగా చూడాలి” అన్నారు.