01-12-2025 03:06:33 PM
లక్నో: వరి కొనుగోలు కేంద్రాలకు వచ్చే ప్రతి రైతు తన ఉత్పత్తులను ఎటువంటి అసౌకర్యం లేకుండా అమ్ముకోగలరని, సకాలంలో వారి బ్యాంకు ఖాతాలో నేరుగా చెల్లింపులు జరిగేలా చూడాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ సోమవారం అధికారులను ఆదేశించారు. వరి సేకరణ పురోగతిపై సీఎం ఆదిత్యనాథ్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. రైతులకు విస్తృత ప్రాప్యత ఉండేలా వరి కొనుగోలు కేంద్రాలను 5,000 కు విస్తరించాలని, కొనుగోలు వేగాన్ని పెంచాలని పేర్కొన్నారు.
ఈ ప్రక్రియలో ఏ దశలోనూ రైతులు ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కోకూడదని, అందుకు తగిన చర్యలు తీసుకొవాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఈ ఏడాది సాధారణ వరి కనీస మద్దతు ధర (MSP) క్వింటాలుకు రూ.2,369గా, గ్రేడ్-ఎ క్వింటాలుకు రూ.2,389గా నిర్ణయించబడిందని అధికారులు సమావేశంలో తెలియజేశారు. ఇది గత సీజన్ కంటే రూ.69 ఎక్కువ అని, ప్రస్తుతం, 4,227 కొనుగోలు కేంద్రాలు పనిచేస్తున్నాయని ఆదిత్యనాథ్ కు వివరించారు.