calender_icon.png 1 December, 2025 | 3:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూబ్లీహిల్స్ రాళ్లు, రప్పలతో ఉండేది

01-12-2025 03:03:33 PM

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu) పర్యటించారు. ఉంగుటూరు మండలం గోపీనాథపట్నంలో లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ... ఎన్నికల్లో సూపర్ సిక్స్ హామీలు ఇస్తే ఎగతాళి చేశారు, అమలు చేయలేరన్నారు. సూపర్ సిక్స్ ను సూపర్ హిట్  చేసి చూపించామన్నారు. ప్రజల ఆహారపు అలవాట్లలో అనేక మార్పులు వస్తున్నాయి. రైతులు డిమాండ్ ఆధారిత పంటలు పండించి ఆదాయం పెంచుకోవడంపై దృష్టి పెట్టాలని చంద్రబాబు సూచించారు. ఆక్వా రైతులకు తక్కువ ధరకే విద్యుత్ సరఫరా చేస్తున్నామని సీబీఎన్ వివరించారు.

అభివృద్ధి చెందితేనే భూములకు రెక్కలు: సీఎం చంద్రబాబు

రాష్ట్రం అభివృద్ధి జరిగితేనే భూముల ధరలు పెరుగుతాయని తెలిపారు. హైదరాబాద్ లో అభివృద్ధి జరిగింది కాబట్టే భూములు ధరలు పెరిగాయని వెల్లడించారు. జూబ్లీహిల్స్(Jubilee Hills) ఒకప్పుడు రాళ్లు రప్పలతో ఉండేవన్న సీఎం చంద్రబాబు కనీసం కారు కూడా వెళ్లకపోయేదని గుర్తుచేశారు. హైటెక్ సిటీని అభివృద్ధి చేశామని గుర్తుచేశారు. ఒకప్పుడు కోకాపేటలో రూ. 10 వేలకు ఎకరం ఉండేది.. ఇప్పుడు ఎకరం రూ. 170 కోట్లకుపైగా పలుకుతోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం పది ఎకరాలు అమ్మితే రూ. 1300 కోట్లు వచ్చాయని చెప్పారు. అభివృద్ధి జరిగితేనే భూముల ధరలకు రెక్కలొస్తాయని పునరుద్ఘాటించారు. ఏపీలోనూ భవిషత్తులో అలాంటి రోజులు వస్తాయని చంద్రబాబు వివరించారు.