calender_icon.png 17 January, 2026 | 11:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం కప్ క్రీడలు ప్రారంభం

17-01-2026 09:26:03 PM

కుభీర్,విజయక్రాంతి): కుభీర్ మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్ లో శనివారం సీఎం కప్ క్లస్టర్ స్థాయి 2వ అడిషన్ వాలీబాల్, కబడ్డీ, ఖోఖో క్రీడల పోటీలను ఎంపీడీఓ గంగా సాగర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడల్లోనూ సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి విద్యార్థులు ముందుండాలని పేర్కొన్నారు.

క్రీడలు శారీరక దారుఢ్యానికి, మానసిక ఆరోగ్య పరిరక్షణకు అవి ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. క్రీడలు నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని దీంతో శరీర సౌష్టవం పెంపొందుతుందని సూచించారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని ఓటమిని పూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ విజయ్ కుమార్, పాఠశాల హెచ్ఎం సట్ల గంగాధర్, ఎస్సై కృష్ణారెడ్డి, పీడి క్రాంతి, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.