17-01-2026 09:13:13 PM
కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామానికి చెందిన పంబ నరసయ్య సత్తవ్వ దంపతుల కుమారుడు పంబ పవన్ కి గత రెండు రోజుల క్రితం వెలువడిన ఆర్మీ ఫలితల్లో సంబందించిన ఐటీబీపీ డిపార్ట్మెంట్లో ఉద్యోగం రావడం చాలా సంతోషకరమని ఈ సందర్బంగా పంబ పవన్ ను గ్రామ సర్పంచ్ షేక్ యాస్మిన్ ఫిరోజ్ పాషా పూలమాల వేసి ఘనంగా సన్మానం చేశారు.
ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ... పవన్ కష్టపడిన తీరును చూసి గ్రామంలోని ఉన్న యువకులు స్ఫూర్తిగా తీసుకొని యువత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని గ్రామంలో యువకులు చెడు మార్గాలను ఎంచుకోకుండా మంచి మార్గాన్ని ఎన్నుకొని గ్రామానికి ప్రభుత్వ ఉద్యోగాలకు కేంద్రంగా ఉండాలని యువతను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో తిక్కల అనంతరావు,తదితరులు పాల్గొన్నారు.