17-01-2026 09:39:44 PM
కోనరావుపేట,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం భూక్యా రెడ్డి తండా గ్రామపంచాయతీ సిబ్బందికి, పారెస్ట్ వాచర్లకు సర్పంచ్ బానోత్ నరేష్ నాయక్ దుస్తువులు,సేఫ్టీ గ్లౌజులు అందజేశారు.సంక్రాంతి పండగ సందర్బంగా గ్రామంలో నిత్యం గ్రామ పరిశుభ్రత కోసం శ్రమించే గ్రామ సిబ్బందికి దుస్తులు ఇచ్చి,వాటితోపాటు వారి సెప్టీ కోసం పనిచేయగా వేసుకువడానికి చేతులకు గ్లౌస్ లు అందించారు. అదేవిధంగా గ్రామ అటవీ ప్రాంతంలో అడవిని సంరక్షించడానికి పని చేసే వాచర్లకు దుస్తువులు అందజేశారు. గ్రామ సిబ్బంది, వాచర్లు సర్పంచ్ నరేష్ నాయక్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లకావత్ రాజు, దేవేందర్,నారాయణ ,రవి ,బాల్కరాజు తదితరులు పాల్గొన్నారు.