calender_icon.png 30 January, 2026 | 6:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగిరెడ్డిపేట్లో మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు

30-01-2026 04:56:53 PM

జాతీయ రహదారి విస్తరణలో గాంధీ విగ్రహం తొలగించి ఇంకా ఏర్పాటు చేయకపోవడం బాధాకరం

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మహాత్మా గాంధీ సత్యం,అహింసా మార్గంలో చేసిన పోరాటం ప్రపంచవ్యాప్తంగా  స్ఫూర్తినిచ్చిందని, నాగిరెడ్డిపేట్ మండల కేంద్రంలో మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకల్లో మండల మాజీ జెడ్పిటిసి ఉమన్నగారి మనోహర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మాజీ జెడ్పిటిసి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... మహాత్మా గాంధీ సత్యం,అహింసా మార్గంలో పోరాటం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును ఇచ్చిందని, భారత ఆర్థిక వ్యవస్థ కోసం ఖాదీ,గ్రామీణ పరిశ్రమలను ప్రోత్సహించారు.

బ్రిటిష్ పాలన నుండి భారతదేశానికి స్వాతంత్య్రం తీసుకురావడంలో కీలక నాయకుడగా సామాజిక కార్యకర్తగా కొనియాడారు.బిజెపి ప్రభుత్వం మహాత్మా గాంధీ ఉపాధి హామీ పేరును లేకుండా చేస్తున్నారని ధ్వజం ఎత్తేరు.అందరూ సత్యం,అహింసతో నేర్చుకోవాలని అదే బాటలో నడుస్తూ ప్రతి ఒక్కరికి హింస అనేది లేకుండా శాంతితో కూడుకున్న నైతిక విలువలతో ముందుకెళ్లాలని, తెలిపారు.నాగిరెడ్డిపేట మండలం మీదుగా కొనసాగిన జాతీయ రహదారి విస్తరణలో  భాగంగా మహాత్మా గాంధీ గాంధీ విగ్రహాన్ని తొలగించి ఇప్పటివరకు ఏర్పాటు చేయకపోవడం బాధాకరం సిగ్గుచేటని అన్నారు.ఈ కార్యక్రమంలో గోపాల్పేట్ గ్రామ సర్పంచ్ వంశీకృష్ణ గౌడ్, నాయకులు బాలాజీ,కృష్ణ గౌడ్,మసూద్,సాయిలు తదితరులు ఉన్నారు.