30-01-2026 05:05:09 PM
సమ్మక్క-సారలమ్మ తల్లుల ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి
నిలువెత్తు బంగారం సమర్పించిన ఎమ్మెల్యే విజయ రమణారావు
సుల్తానాబాద్,(విజయక్రాంతి): సమ్మక్క సారలమ్మ తల్లుల ఆశీస్సులతో పెద్దపల్లి నియోజకవర్గంలోని ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఆ తల్లులను వేడుకోవడం జరిగిందన్నారు. శుక్రవారం పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నీరుకుల్లా మానేటి రంగనాయక స్వామి ఆలయ ఆవరణలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరలో ఎమ్మెల్యే నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు. అలాగే గర్రెపల్లి గ్రామంలోనూ సమ్మక్క సారలమ్మ దేవతలను దర్శించుకున్నారు.
ఎమ్మెల్యే వెంట జాతర కమిటీ చైర్మన్ పొన్నం చంద్రయ్య గౌడ్, సర్పంచ్ కాంపల్లి సతీష్ కుమార్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, మాజీ మార్కెట్ చైర్మన్ సాయిరి మహేందర్, దనాయక్ దామోదర్ రావు, కోటగిరి రమేష్ తో పాటు పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు, జాతర కమిటీ సభ్యులు ఉన్నారు. నీరుకుల్లా జాతర భక్తులతో కిక్కిరిసిపోయింది. వనదేవతల దర్శనం కోసం భక్తులు క్యూలైన్ కట్టారు. ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై మొక్కలు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాతర కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లను చేయడంతో ప్రశాంత వాతావరణంలో మొక్కలు చెల్లించుకున్నారు.
ఎలాంటి అవంచనమైన సంఘటనలు జరగకుండా సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, ఎస్ఐ చంద్రకుమార్ భారీ బందోబస్తు నిర్వహించారు. ఏర్పాట్లను తాసిల్దార్ బషీరుద్దీన్, ఎంపీడీవో దివ్య దర్శన్ రావు లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఈవో శంకరయ్య, ఉప సర్పంచ్ సతీష్ తదితరులు ఉన్నారు. అలాగే నారాయణపూర్, గర్రెపల్లి, తొగర్రాయి గ్రామాల్లో జరిగే జాతర కు భక్తులు పెద్ద సంఖ్యల హాజరై మొక్కలు చెల్లించుకున్నారు. నారాయణపూర్ చైర్మన్ తిరుపతిరావు, సర్పంచ్ గుడుగుల సతీష్, ఉపసర్పంచ్ రామారావు, సర్పంచ్ వీరగోని రమేష్ గౌడ్, చిలుక సతీష్ తో పాటు పలువురు ఉన్నారు.