calender_icon.png 30 January, 2026 | 6:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ సర్కార్ దౌర్జన్యం హద్దుమీరుతుంది

30-01-2026 04:49:06 PM

హైదరాబాద్: బీఆర్ఎస్ నాయకుల మీద కాంగ్రెస్ సర్కార్ దౌర్జన్యం హద్దులుమీరుతోందని కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. తన స్వగ్రామం వీణవంకలో జరిగే సమ్మక్క, సారలమ్మ జాతరలో పాల్గొనకుండా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌషిక్ రెడ్డిని పోలీసులు అకారణంగా నిర్బంధించడం, వారి కుటుంబసభ్యుల పట్ల దురుసుగా ప్రవర్తించడం రాష్ట్రంలో సాగుతున్న అరాచక, నిర్భంధ పాలనకు నిదర్శనమన్నారు.

కౌశిక్ రెడ్డి మీద పోలీసుల దౌర్జన్యాన్ని కేటీఆర్ ఖండించారు. ప్రజా సమస్యల మీద నిత్యం పోరాడే నాయకులను మీ నిర్బంధాలతో, అక్రమ కేసులతో భయపెట్టలేరని కేటీఆర్ పేర్కొన్నారు. వీణవంకలో వన దేవతలు శ్రీ సమ్మక్క–సారలమ్మ తల్లుల ఆశీస్సులు హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు కలగాలని భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించేందుకు వెల్లిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కొబ్బరికాయ కూడా కొట్టనివ్వకుండా పోలీసులు అరెస్ట్ చేశారు.