17 April, 2026 | 3:36 AM

సుల్తానాబాద్‌లో సీఎం కప్ క్రీడాజ్యోతి ర్యాలీ

12-01-2026 09:30 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి అక్కపాక సురేష్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సెకండ్ ఎడిషన్ సీఎం కప్ క్రీడాజ్యోతి ర్యాలీ సుల్తానాబాద్ పట్టణంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమేష్, ఎంఈఓ రాజయ్య,స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు ముస్త్యాల రవీందర్, అమీర్ శెట్టి తిరుపతి, మున్సిపల్ మాజీ చైర్మన్ గాజుల లక్ష్మీ రాజమల్లు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బిరుదు సమతా కృష్ణ ,పాల్గొని క్రీడాజ్యోతిని ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... సీఎం కప్ క్రీడా పోటీలు గ్రామీణ, పట్టణ స్థాయిలోని క్రీడాకారులకు మంచి వేదికగా నిలుస్తాయని తెలిపారు. యువత క్రీడల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఐక్యతను పెంపొందించుకోవాలని సూచించారు. సీఎం కప్ ద్వారా దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీసి రాష్ట్ర, జాతీయ స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉందని పేర్కొన్నారు.ఈ ర్యాలీలో సీనియర్ క్రీడాకారులు గుణపతి, అమీర్ శెట్టి రాజలింగం, అబ్బయ్య గౌడ్, యువ సంకల్ప ఫౌండేషన్ అధ్యక్షులు తుమ్మ రాజ్ కుమార్,పేట కార్యదర్శి దాసరి రమేష్, గెల్లు మధుకర్, ఆలేటి సంపత్, వెంకటేష్, ప్రణయ్, సత్యం, శివ, ఎల్లె రాజు అజ్జుతో పాటు పలువురు క్రీడాకారులు,వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.