calender_icon.png 13 February, 2026 | 12:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థుల నిరసనపై స్పందించని సీఎం

13-02-2026 12:41:34 AM

  1. రిబ్బన్లు కట్ చేయడం తప్ప రెండున్నరేళ్లుగా చేసిందేమీ లేదు
  2. 62సార్లు ఢిల్లీకి పోయి నీవు సాధించిందేమిటి?
  3. మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపాటు

హైదరాబాద్, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి) : కల్తీ ఆహారం మాకొద్దు అంటూ సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ మండలం ఎస్టీ ఆశ్రమ పాఠశాల విద్యార్థులు రోడ్డెక్కినా.. భోజనం బాగుండటం లేదని హైద రాబాద్ నడిగడ్డపై ఉన్న ఉస్మానియా యూ నివర్సిటీలో రాత్రి నుంచి విద్యార్థులు నిరసన తెలియజేస్తున్నా విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డికి ఉలుకు, పలుకు లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు.

గురుకులాలు, ఉస్మానియా యూనివ ర్సిటీలో విద్యార్థుల నిరసనలపై హరీశ్ రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. నిత్యం గాలి మోటార్లలో చక్కర్లు కొట్టే సీఎం రేవంత్ రెడ్డికి, గురుకులాల్లో నెలకొన్న అధ్వాన పరిస్థితులపై సమీక్షించే తీరిక లేకపోవడం సిగ్గు చేటు అని మండిపడ్డారు. ఉస్మానియాకు వెళ్లి రిబ్బన్లు కట్ చేయడం తప్ప రెండున్నరేండ్లుగా చేసిన అభివృద్ధి ఏముందని, మాట లు కోటలు దాటితే ఆచరణ గడప దాటది అనడానికి ముఖ్యమంత్రి పర్‌ఫెక్ట్ ఉదాహరణ అని స్పష్టం చేశారు.

రాష్ట్ర అభివృద్ధి కోసమే అంటూ ఇప్పటి వరకు 62 సార్లు ఢిల్లీకి పోయిన రేవంత్ రెడ్డి నువ్వు సాధించిదేమిటో మొన్నటి కేంద్ర బడ్జెట్ తోనే తేటతె ల్లమైందని ఎద్దేవా చేశారు. ఒకవైపు గురుకులాల ఖ్యాతిని మసకబార్చిన రేవంత్ రెడ్డి, మరో వైపు అంచనాలు పెంచి కమీషన్లు దండుకోవడానికే యంగ్ ఇండియా స్కూల్స్ పేరిట భారీ నాటకానికి తెరతీశారని ఆరోపించారు.

కూట్లో రాయి తీయలేనోడు, ఏట్లో రాయి తీస్తడట అన్నట్లు ఉన్న గురుకులాల్లో పిల్లలకు మంచి భోజనం పెట్టలేని ప్రభు త్వం, అంతర్జాతీయ స్థాయి వసతులు కల్పిస్తారా అని ప్రశ్నించారు. పురుగుల్లేని అన్నం కోసం విద్యార్థులు నడిరోడ్డెక్కి నిరసన తెలియచేయాల్సిన దుస్థితి కల్పించడమేనా ఇం దిరమ్మ రాజ్యమా?, ఉస్మానియా విద్యార్థులు, తల్లిదండ్రులకు కనీస గౌరవం కూడా ఇవ్వకుండా అవమానించడమేనా మీ ప్రజాపాలనా అని హరీశ్‌రావు ప్రశ్నించారు.

హా ర్వార్డ్ వంటి అంతర్జాతీయ విశ్వవిద్యాలయానికి వెళ్లి వచ్చినా కూడా.. మీరు విద్య పట్ల, విద్యార్థుల పట్ల ప్రాధాన్యం చూపకపోవడం శోచనీయమని తెలిపారు. ఇప్పటికైనా విద్యాశాఖ మీద దృష్టి సారించి, గురుకుల విద్యా ర్థులకు పురుగుల్లేని భోజనం అందించాలని, ఉస్మానియా యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.