calender_icon.png 13 November, 2025 | 3:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీకి సీఎం

13-11-2025 12:47:02 AM

  1. పార్ట్‌నర్‌షిప్ సమావేశానికి హాజరుకానున్న రేవంత్‌రెడ్డి
  2. ఏఐసీసీ పెద్దలతోనూ సమావేశం! 
  3. డీసీసీ, కార్పొరేషన్ చైర్మన్ పదవులపై చర్చ?

హైదరాబాద్, నవంబర్ 12 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. గురువారం ఉదయం 9 గంటలకు ఢిల్లీలో జరిగే యూఎస్ స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్ ఫోరం సమావేశంలో పాల్గొననున్నా రు. డిసెంబర్ 8, 9 తేదీల్లో రైజింగ్ ఇండియాలో భాగంగా హైదరాబాద్‌లో ఇండో, యూఎస్ సమ్మిట్ నిర్వ హిస్తున్నారు. ఈ సమ్మిట్ కోసం వివిధ కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అవుతారు. అనం తరం సీఎం పార్టీ పెద్దలను కలిసే అవకాశం ఉందని సమాచారం.

డీసీసీ అధ్యక్షులు నియామకం విషయాలో పార్టీ వారితో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. డీసీసీ పదవుల భర్తీపై ఇటీవలనే ఏఐసీసీ పరిశీలకులు రాష్ట్రంలో పర్యటించి పూర్తి డేటాతో తిరిగి వెళ్లిన విషయం తెలిసిందే. డీసీసీ తుది జాబితా పూర్త యిందని, ఇక ప్రకటించడమే మిగిలి ఉందని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం ఢిల్లీ పర్యటనలో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.