కాసేపట్లో పోలీసు మీట్.. సాయంత్రం వివిధ శాఖ అధికారులుతో సీఎం, డిప్యూటీ సీఎం సమావేశం
02-07-2024 10:36 AM
హైదరాబాద్ : కమాండ్ కంట్రోల్ సెంటర్ లో పోలీసు మీట్ కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ఉదయం 11.30 నిమిషాలకు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 3.30 నిమిషాలకు సచివాలయంలో అన్ని శాఖల కార్యదర్శులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించనున్నారు. కాగా.. ఇవాళ సాయంత్రం వివిధ శాఖల అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశం కానున్నారు. రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రయోజనాలే ప్రధానంగా చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఏఏ అంశాలు చర్చించాలన్న ఎజెండాలో సమావేశం నిర్ణయిస్తారు. జూన్ 6వ తేదీన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల సమావేశం జరుగునుంది.






