18 July, 2026 | 4:25 AM

శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం

02-07-2024 09:53 AM

తిరుపతి : తిరుమలలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 8 గంటలు పడుతోంది. శ్రీవారి సర్వ దర్శనాకిని 10 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు సోమవారం 75,449 మంది ఏడుకొండవాడిని దర్శించుకున్నారు. 27,121 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న తిరుమలలో శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.91 కోట్లు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి రోజు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అత్యున్నత ప్రమాణాలతో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని టీటీడీ ఈవో జే శ్యామలరావు అధికారులను ఆదేశించారు.