18 July, 2026 | 4:01 AM

నిరహార దీక్ష విరమించిన మోతీలాల్ నాయక్

02-07-2024 11:02 AM

హైదరాబాద్ : ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్ 2,3 పోస్టుల సంఖ్యను పెంచాలని, మెగా డీఎస్సీ నిర్వహించి నియమకానలు చేపట్టాలని ఓయూ విద్యార్థి నాయకుడు మోతీలాల్ నాయక్ చేస్తున్న నిరహార దీక్షను విరమించారు. నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం మోతీలాల్ నాయక్ జూన్ 24వ తేదీ నుంచి గత 9 రోజులుగా గాంధీ దవాఖానలో నిరాహార దీక్ష కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత 9 రోజులుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదని మండిపడ్డారు. ఆరోగ్యం దెబ్బతినడంతోనే తను దీక్షను విరమిస్తున్నట్లు తెలిపారు. రేపటి నుంచి ప్రత్యేక్షంగా నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని మోతీలాల్ పేర్కొన్నారు.