12-11-2025 01:12:08 AM
రాజేంద్రనగర్, నవంబర్ 11 (విజయ క్రాంతి ): హృదయం నుంచి ఇచ్చిన విద్య సమాజంలో విప్లవం తీసుకు రాగలరని రాజేంద్రనగర్ మండల విద్యాధికారి శంకర్ రాథోడ్ తెలిపారు. మంగళవారం రాజేంద్రనగర్ మండల పరిధిలోని శ్రీరామ్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా ఘనంగా జాతీయ విద్యా దినోత్సవాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. హృదయం నుంచి ఇచ్చిన విద్య ఈ సమాజంలో విప్లవం తీసుకురావడమే కాకుండా ఎందరును మేధావులను తయారు చేస్తుందన్నారు.
సమ్మిట్ 1 పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆయన బహుమతులను అందజేశారు. ముందుగా అబ్దుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శంకర్, ఉపాధ్యాయురాలు లతా, ఆశాజ్యోతి విద్యార్థులు పాల్గొన్నారు.