10 April, 2026 | 3:16 PM

Breaking News

ఉపాధి హామీ పనులు వేసవిలో ఉదయం పూట చేసుకోవాలి   •   'ఇజ్రాయెల్ ఒక క్యాన్సర్ దేశం' — పాకిస్థాన్ రక్షణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు   •   క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు   •   ఫార్మా కంపెనీలో గాయపడిన కార్మికులకు అండగా ఉంటాం   •   అమెరికా, ఇరాన్ శాంతి చర్చలపై కమ్ముకున్న నీలినీడలు   •   తల్లి ఇద్దరు కుమార్తెల హత్య.. భర్తతోపాటు ఆ 10 మంది అరెస్ట్   •   బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులన్నీ కాసుల కోసమేనా? అన్నీ మామ, అల్లుడికే తెలుసంటే ఎలా?   •   కాళేశ్వరం దేవస్థానం డైరెక్టర్ గా నియమితులైన కాటం సత్యం   •   గోదావరి పుష్కరాల ఘాట్లకు వెళ్లే రోడ్లను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలి   •   రచ్చ పల్లిలో చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కనవేన స్వప్న శ్రీనివాస్   •  

సిఎం సహాయ నిధి పేదలకు వరం

10-04-2026 01:34 PM

మఠంపల్లి ఏప్రిల్ 10(విజయ క్రాంతి): పేదలకు ఆపత్కాలంలో సీఎం రిలీఫ్ ఫండ్ వరమని మఠంపల్లి మండలంలోని పెదవీడు గ్రామ సర్పంచ్ అమరారపు వెంకటేశ్వర్లు అన్నారు.ఈ సందర్భంగా ఆయన వివిధ అనారోగ్య కారణాల వలన చికిత్స పొందిన ఏడుగురు లబ్దిదారులకు రూ.3.39 లక్షలు విలువ చేసే చెక్కులను హుజూర్ నగర్ లోని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం అందజేశారు. ప్రమాదాలతో పాటు అనారోగ్యంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా వారిని మంత్రి ఉత్తమ్ సహకారంతో ఆదుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో  5వ వార్డ్ సభ్యులు టి.శ్రీనివాస్,నాగేంద్ర, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.