8 July, 2026 | 6:13 PM

నిరుపేద కుటుంబాలకు అండగా సీఎం సహాయ నిధి

08-07-2026 05:28 PM

బోథ్,(విజయక్రాంతి): నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతుందని కాంగ్రెస్ పార్టీ బోత్ మండల కన్వీనర్ మెరుగు భోజన్న ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కుర్మే మహేందర్ పేర్కొన్నారు. బుధవారం ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని ఆర్థికంగా వెనుక పడ్డవారు వినియోగించుకోవాలని కోరారు. ప్రజా ప్రభుత్వంలో ప్రజల సంక్షేమం కోసమే పథకాల అమలు చేస్తుందని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బొజ్జ సాయన్న రహీముద్దీన్ ఎండి అబ్రార్ భీమ బుచ్చన్న బీరం రవి తదితరులు ఉన్నారు.