8 May, 2026 | 7:03 PM

మహిళలంటే సీఎం రేవంత్‌కు గౌరవం లేదు

11-12-2024 12:00 AM

బీఆర్‌ఎస్ మహిళ నేత తుల ఉమ ఆగ్రహం

హైదరాబాద్, డిసెంబర్ 10 (విజయక్రాంతి): మహిళలంటే సీఎం రేవంత్‌కు గౌరవం లేదని, రాష్ట్రం లో ఇటీవల జరిగిన వరుస ఘటన లు రుజువు చేస్తున్నాయని బీఆర్‌ఎస్ మహిళా నాయకురాలు తుల ఉమ విమర్శించారు. మంగళవా రం తెలంగాణ భవన్‌లో మీడియా తో మాట్లాడుతూ.. లగచర్లలో మ హిళలపై మొదట పోలీసులు దాడి చేశారని, రెండు రోజుల క్రితం అ సెంబ్లీ వద్ద ఆశా వర్కర్లపై సైతం దమనకాండను కొనసాగించారని మండిపడ్డారు.

చాలామంది మహిళలను ఇష్టారీతిగా పోలీసులు నిం దించారని, ఇష్టమొచ్చినట్టు కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలం గాణ తల్లి రూపం మార్చి విగ్రహా న్ని సీఎం ఆవిష్కరించిన రోజే ఆశావర్కర్లపై దాడి జరగడం దారుణమ న్నారు.  మహిళా కమిషన్‌కు పోలీసుల దారుణాలు వివరించామని, ఈ ఘటనపై విచారణ జరిపి చర్య లు తీసుకుంటామని మహిళా కమిషన్ చైర్మన్ హామీ ఇచ్చినట్లు పేర్కొ న్నారు. 

ఆశా వర్కర్లకు బీఆర్‌ఎస్ అండగా ఉంటుందని చెప్పారు. ని యంతలా వ్యవహరిస్తున్న రేవంత్‌రెడ్డికి మహిళలు తగిన బుద్ధి చెబు తారని, తెలంగాణ తల్లిని మార్చిన రేవంత్‌ను మహిళలు వదిలిపెట్టే ప్ర సక్తే లేదని హెచ్చరించారు.

అనంత రం ఆపార్టీ సీనియర్ నాయకురా లు సుమిత్ర మాట్లాడుతూ ఆశావర్కర్లపై ప్రభుత్వం మానవత్వం లే కుండా ప్రవర్తించిందని, పోలీసుల దాడుల్లో గాయపడ్డ మహిళలను సకాలంలో ఆస్పత్రులకు కూడా తరలించలేకపోయారని విమర్శించారు. ప్రభుత్వం ఆశావర్కర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.