8 May, 2026 | 8:22 PM

17న హైదరాబాద్‌కు రాష్ట్రపతి

11-12-2024 12:00 AM
  1. శీతాకాల పర్యటనలో భాగంగా రాక 
  2. ఐదు రోజులు బస చేయనున్న ముర్ము
  3. ఏర్పాట్లు చేస్తున్న సర్కారు

హైదరాబాద్, డిసెంబర్ 10 (విజయక్రాంతి): శీతాకాల పర్యటన నేపథ్యంలో రా ష్ర్టపతి ద్రౌపది ముర్ము ఈ నెల 17న హైదరాబాద్‌కు రానున్నారు. ఈ సందర్భంగా చే పట్టాల్సిన ఏర్పాట్లపై సీఎస్ శాంతికుమారి మంగళవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు.

ఈ నెల 17 నుంచి 21 వరకు ముర్ము హైదరాబాద్‌లోని  రాష్ర్టపతి నిలయంలో బస చేస్తారని సీఎస్ తెలి పారు. ఆమె పర్యటనకు సంబంధిత అధికారులు విస్తృత ఏర్పాట్లు చేయాలన్నారు. రాష్ర్టపతి నిలయంలో 24 గంటలు స్నేక్ క్యాచర్ బృందాన్ని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

జీహెచ్‌ఎంసీ సమన్వయంతో రాష్ర్టపతి నిలయం పరిసరాల్లో కోతుల బెడదను ఎదుర్కొనేందుకు ప్రత్యేక బృందాలను నియమించాలని ఆదేశించా రు. పోలీసు, అగ్నిమాపక శాఖలు భద్రతా ప్రణాళికను రూపొందించాలన్నారు. ఆర్‌అండ్‌బీ అధికారులు అవసరమైన బారికేడ్‌లు, ఇతర ఏర్పాట్లు చేయాలన్నారు.

జీహెచ్‌ఎంసీ, పోలీసు శాఖల సమన్వయంతో రోడ్ల మరమ్మతులు చేపట్టాలని, నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీజీపీ జితేందర్, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా, రోడ్డు భవనాల శాఖ  ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్, ఫైర్ సర్వీసెస్ డీజీ నాగిరెడ్డి, జీఏడీ కార్యదర్శి రఘునందన్‌రావు, సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ హరీశ్, ప్రొటోకాల్ డైరెక్టర్ వెంకట్‌రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.