8 May, 2026 | 5:55 PM

ప్రాసిక్యూషన్స్ డైరెక్టర్‌గా సాంబశివారెడ్డి

11-12-2024 12:00 AM

హైదరాబాద్, డిసెంబర్ 10 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రాసిక్యూషన్స్ జాయింట్ డైరెక్టర్ సాంబశివారెడ్డికి పూర్తి అదనపుస్థాయి డైరెక్టర్ బాధ్యతలు అప్పగిస్తూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. డైరెక్టర్ జీ వైజయంతి గత నెల 30న పదవీ విరమణ చేశారని, దీంతో జాయింట్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సాంబశివారెడ్డికి డైరెక్టర్ బాధ్యతలు అప్పగిస్తున్నామని వెల్లడించారు.