కానిస్టేబుల్ సురేష్‌కు సీఎం ప్రశంసలు
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేశ్ ను ప్రశంసించారు. ఆదివారం యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. అయితే రాజేంద్రనగర్‌లో యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్ష రాసేందుకు వెళ్లుతున్న ఓ యువతిని ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేష్ కరెక్ట్ సమయానికి పరీక్ష కేంద్రానికి చేర్చారు.
దీంతో విషయం తెలసుకున్న సీఎం ట్రాఫిక్ కానిస్టేబుల్ ను అభినందించారు. “వాహనాల నియంత్రణ మాత్రమే తన డ్యూటీ అనుకోకుండా సాటి మనిషికి సాయం చేయడం బాధ్యత అని భావించిన ట్రాఫిక్ కానిస్టేబుల్‌కు నా అభినందనలు” అని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. యూపీఎస్సీ పరీక్షల్లో విజయం సాధించాలని సీఎం ఆ యువతికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
https://www.instagram.com/reel/C8Rrh9Hpe-0/?utm_source=ig_web_copy_link






