calender_icon.png 15 February, 2026 | 3:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

16న ఏమవుతుందో చూద్దాం..

15-02-2026 01:24:24 PM

హైదరాబాద్: కరీంనగర్ మేయర్ పీఠంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ మేయర్ రేసులో కాంగ్రెస్ పార్టీ ఉందని, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ కూడా దక్కించుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్ లో బీజేపీకి పూర్తి స్థాయి మెజార్టీ లేగనే మేయర్ పోటీ నుంచి తప్పుకున్నట్లు ఎంపీ ధర్మపురి అర్వింద్ చెప్పారని, నిజామాబాద్ మాదిరిగానే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లోనూ బీజేపీకి మెజార్టీ లేదని వెల్లడించారు. మెజార్టీ లేకున్నా మేయర్ అవుతామని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎలా చెబుతారు..? అని పొన్నం ప్రశ్నించారు. 

రాజకీయ పార్టీ గా గతంలో మేము 13 సీట్లు గెలిచినప్పుడు కూడా కరీంనగర్  లో మేయర్ అయ్యామని, ఇప్పుడు కూడా అన్ని రాజకీయ పార్టీల నాయకులు రాష్ట్ర ప్రభుత్వం సలహా సూచనల మేరకు వ్యవహరిస్తామన్నారు. ముఖ్యమంత్రి, మంత్రుల జోక్యం లేదని, స్థానికంగా గెలిచిన ప్రజా ప్రతినిధులు వారి ఆలోచనకనుగుణంగా వ్యవహరిస్తామని సూచించారు. కార్పొరేషన్లలో ప్రజాస్వామ్య బద్ధంగా మేయర్ ను ఎన్నుకుంటారని, కాంగ్రెస్ ప్రభుత్వం తరపున అభివృద్ధికి సహకరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 

అందరిని కలుపుకొని మేయర్ పీఠం దక్కించుకునేందుకు ప్రయత్నిస్తామని, బీజేపీ ఎలాంటి ప్రయత్నాలు చేస్తుందో తాము కూడా అలానే చేస్తామని ఆయన వివరించారు. మేయర్, ఛైర్ పర్సన్ పీఠం కోసం క్యాంపు రాజకీయాలు ఉంటాయని, ఎన్నిక కాగానే చాలా చోట్ల క్యాంప్ జరిగిందని, ఇప్పుడు కొత్తగా క్యాంప్  లు ఏర్పాటు చేయలేదని మంత్రి పొన్నం వ్యాఖ్యానించారు.