08-11-2025 09:02:52 PM
పినపాక,(విజయక్రాంతి): జానంపేట గ్రామ పంచాయతీలో మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకల్లో జానంపేట గ్రామ పంచాయతీలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం నుంచి తెలంగాణ కోసం తెలంగాణ ప్రజల కోసం కష్టపడి ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాలు కల్పించిన మన ప్రియతమ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి అదే కాదు తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యం ఇచ్చిచ్చిన వ్యక్తి భారతదేశంలో మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి, ఇది తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండి అందరూ సన్న బియ్యం బువ్వ తోటి తింటున్నారు.
ఒక తల్లి కి నలుగురు ఐదుగురు కొడుకులు ఉంటారు కానీ అన్నం పెట్టే కొడుకు లేడు ఈరోజో అన్నం పెట్టిన కొడుకు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలకి కొన్ని వేల కోట్లు పెట్టిన వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి గత పది సంవత్సరాల చరిత్రలో ఒక ఇల్లు రాలేదు, ఈరోజు రేవంత్ రెడ్డి నియోజకవర్గానికి మూడు వేల 500 ఇల్లు ఇచ్చి ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకున్న వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో రాష్ట్ర ప్రజలందరూ అభినందిస్తున్నారు. కొంతమంది నాయకులు కావాలనే బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు.