calender_icon.png 8 November, 2025 | 11:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేవాలయ నూతన నిర్మాణానికి విరాళం అందజేత

08-11-2025 09:06:05 PM

ఇబ్రహీంపట్నం: నూతనంగా నిర్మిస్తున్న శ్రీ సీతారాముల గుడి నిర్మాణానికి ఎలిమినేడు గ్రామానికి చెందిన మంచి రెడ్డి నరసింహారెడ్డి రూ.5లక్షల విరాళంగా అందజేశారు. దేవాలయానికి విరాళంగా అందజేసినందుకు కమిటీ సభ్యులు వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ నిర్మాణానికి సహకరించాలని, ఆ సీతారాముడి ఆశీర్వాదం అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. కమిటీ సభ్యులు బూడిద భీమార్జున్ రెడ్డి, బోస్ పల్లి చంద్రశేఖర్, నరాల వెంకటేష్, శ్రీరామ్ యాదవ్, పోరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మడుపు శ్రీశైలం, బుట్టి మహేందర్, కొంగరి జంగయ్య తదితరులు పాల్గొన్నారు.