08-11-2025 08:59:56 PM
- అండగా నిలిచిన చింతల బయ్యారం యువకులు
పినపాక,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం పాత రెడ్డిపాలెం గ్రామపంచాయతీ పరిధిలో చింతల బయ్యారం గ్రామానికి చెందిన ముత్తేబోయిన రమణ, భర్త వెంకటేశ్వర్లు అనే మహిళకు చేతికి గాయం కావడంతో గత కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న చింతల బయ్యారం గ్రామ యువకులు చలించి నిరుపేద కుటుంబానికి 25 కేజీల బియ్యం, రూ 11,500 శనివారం వారి ఇంటికి వెళ్లి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కుటుంబానికి ఎటువంటి ఆపద వచ్చిన అన్ని విధాలుగా అండగా ఉంటామని ఏ సహాయం కావాలన్నా తమను కోరవచ్చని గ్రామ యువకులు సూచించారు.