calender_icon.png 6 December, 2024 | 3:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్ కట్టిన ఆలయంలోనే సీఎం పుట్టినరోజు వేడుకలు

08-11-2024 07:26:31 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటనపై బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. జన్మదిన వేడుకలను సీఎం యాదాద్రి ఆలయంలో చేసుకున్నారు. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తానని గతంలో సీఎం వ్యాఖ్యానించిన రేవంత్ రెడ్డి ఇవాళ కేసీఆర్ కట్టించిన ఆలయంలోనే పుట్టినరోజు జరుపుకున్నారని విమర్శించారు. ముసీకి మంచినీళ్లను కాళేశ్వరం నుంచే తరలిస్తానని సీఎం చెప్పారు. తెలంగాణకు స్వాతంత్య్రం తెచ్చిన కేసీఆర్ ను ప్రజలు మరువరు అని హరీశ్ రావు గుర్తుచేశారు. భూమి ఉన్నంతకాలం కేసీఆర్ ను రాష్ట్ర ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేదా..?, తెలంగాణ రాకుంటే నువ్వు సీఎం అవుతుండేనా..? అని హరీశ్ రావు ప్రశ్నించారు.