19 August, 2026 | 11:37 AM

భట్టి విక్రమార్కకు సీఎం జన్మదిన శుభాకాంక్షలు

15-06-2024 12:58 PM

హైదరాబాద్: తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని సీఎం ఆకాంక్షించారు. ప్రజాసేవలో నిమగ్నమై రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. అంతకు ముందు ప్రజాభవన్ లో భట్టి విక్రమార్క పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. పోచమ్మ తల్లి ఆలయంలో విక్రమార్క ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ సభ్యులతో సమక్షంలో 50 కేజీల కేక్ కట్ చేశారు. ఇప్పటికే ఉపముఖ్యమంత్రికి ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.