01-11-2025 07:13:17 PM
బిజెపి మండల అధ్యక్షుడు క్రాంతి కుమార్
ముస్తాబాద్‌లో సీఎం దిష్టిబొమ్మ దహనం
ముస్తాబాద్,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షుడు క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టి ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన స్థాయిని మరిచి భారత్ ఆర్మీ పై పాకిస్తాన్ ను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని ముస్లిం ఓట్ల కోసం పరాయి దేశాన్ని పొగడడం పట్ల సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్బంగా క్రాంతి మాట్లాడుతూ... రాజ్యాంగబద్ధంగా ప్రజాక్షేత్రంలో ఓట్లు అడగడం అందరి హక్కు కానీ అధికార దాహంతో ఎలాగైనా గెలవాలనే ఆలోచన మంచిది కాదన్నారు.ఈ ఎన్నికలో గెలవడానికి ముస్లింల ఓట్ల కోసం పరాయి దేశం ముందు మా దేశాన్ని విమర్శిస్తే సహించేది లేదన్నారు. ముఖ్యమంత్రి తన స్థాయిని మరిచి మాట్లాడడం సబబు కాదని తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని హెచ్చరిస్తూ దిష్టిబొమ్మ దహనం చేశామని పేర్కొన్నారు.రాజకీయ పార్టీలకంటే మాకు దేశమే ముఖ్యమని తెలిపారు.