01-11-2025 07:15:52 PM
వాజేడు (విజయక్రాంతి): ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని చెరుకూరు చింతూరు పేరూరు ధర్మవరం అయ్యవారిపేట పంచాయతీలో నూతనంగా విద్యుత్తు లైన్ లు ఏర్పాటు చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి కాకర్లపూడి విక్రాంత్ నేతృత్వంలో విద్యుత్ శాఖ ఏఈ హర్షత్ హౌమద్ సమక్షంలో శనివారం సర్వే నిర్వహించారు.
ఏక్కడైయితే ప్రజలు విద్యుత్ సమస్యతో బాధపడుతున్నారో వారికి విద్యుత్తులై ఏర్పాటు చేయడం కోసం భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు నిధుల నుండి మంజూరు చేయడం జరుగుతుందని విక్రాంత్ తెలిపారు. ఈ ఐదు గ్రామ పంచాయతీలలో సర్వే నిర్వహించి విద్యుత్ సమస్య పరిష్కారం కోసం ఆయన కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎస్కే కాజావలి నల్లగాసి రమేష్ యాదవ్ కురసం కృష్ణమూర్తి కోరం పగిడయ్య గొబ్బూరి రఘుపతి తుమ్మ ఎర్రబాబు తదితరులు పాల్గొన్నారు.