భారీ వర్షంపై అధికారులతో మాట్లాడిన సీఎం
16-05-2024 05:16 PM
హైదరాబాద్: తెలంగాణలో వర్షాలు, వర్ష ప్రభావంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో మాట్లాడారు. వర్షం కురుస్తున్న ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రజలు ఇబ్బంది పడకుండా వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. తెలంగాణలో ఐదురోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. నేడు హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది.




