కాంగ్రెస్ హామీల అమలు అసాధ్యం
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూసి మాట్లాడాలి
చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి
హైదరాబాద్, మే 16 (విజయక్రాంతి): ఎన్నికల సమయంలో కాం గ్రెస్ ఇచ్చిన గ్యారెంటీల అమలు అసాధ్యమైనవని చేవెళ్ల బీజేపీ అభ్య ర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం లో ఆయన గురువారం మాట్లాడారు. కాంగ్రెస్ సర్కారు వద్ద అసలు నిధులు లేవని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. అధికారం లోకి వస్తే పేదలకు 10 కేజీల బియ్యం ఉచితంగా ఇస్తామని ఏఐసీసీ చీఫ్ ఖర్గే ప్రకటించడంపై విశ్వేశ్వ ర్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.
రేషన్ బియ్యాన్ని ఎవరు తింటున్నా రు? ఎంత తింటున్నారు? అనేది తెలియకుండా, ఎలాంటి రీసెర్చ్ లేకుం డా ఖర్గే ప్రకటిచండంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అలవికాని హామీలను ప్రకటించలేదని, 2047 నాటికి దేశాన్ని నంబర్ వన్‌గా నిలపడాన్ని మోదీ తమ పార్టీ అజెండా తీసుకున్నారని పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఓట్ల కోసం అబద్ధాలను చెప్పిందన్నారు. ఇలా చేయడం ప్రజలకు ఏమాత్రం మంచిది కాదన్నారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు కేఎస్ రత్నం, వెంకట్‌రెడ్డి పాల్లొన్నారు.




