calender_icon.png 13 September, 2024 | 1:08 AM

రేపు సాయంత్రం 4 గంటలకు రుణమాఫీ నిధులు విడుదల

17-07-2024 05:13:43 PM

హైదరాబాద్: ప్రజా భవన్ లో జరిగిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కాంగ్రెస్ నాయకుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర రైతాంగానికి గుడ్ న్యూస్ చెప్పారు. రేపు సాయంత్రం 4 గంటలకు రూ. లక్ష వరకు ఉన్న రైతు రుణాలకు నిధులు విడుదల చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆగస్టులోపే 3 దశల్లో రుణమాఫీ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. గురువారం రూ. 7 వేల కోట్లు నేరుగా రైతుల రుణ ఖాతాల్లోకి వెళతాయన్నారు.

ఈ నెలాఖరులోగా రూ. 1.50 లక్షల వరకు ఉన్న రైతు రుణాలు మాఫీ, ఆగస్టులో రూ.2 లక్షల వరకు రైతు రుణాలు మాఫీ చేస్తామని రేవంత్‌ రెడ్డి తెలిపారు. రైతు రుణమాఫీపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. చిత్తశుద్ధితో ఒకేవిడతలో రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తున్నామన్నారు. ప్రతి రైతును రుణవిముక్తి చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. సీఎం రుణమాఫీ నిధులు విడుదలపై ప్రకటన చేయడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.