సీఎం రేవంత్‌రెడ్డి అహంకారి
మాజీ మంత్రి మోత్కుపల్లి విమర్శలు
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 7 (విజయక్రాంతి ) : సీఎం రేవంత్ రెడ్డి అహంకారం, అసమర్థత కారణంగానే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేకపోయారని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తీవ్రంగా ధ్వజమెత్తారు. అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే బీఆర్‌ఎస్ ఓటు బ్యాంకు బీజేపీకి మళ్లిందంటూ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం మోత్కుపల్లి విలేకరులతో మాట్లాడారు. భువనగిరి, మల్కాజిగిరి స్థానాల్లో ఓటమికి కారణం ఎవరో చెప్పాలని సవాల్ చేశారు.
ఆయన సామాజిక వర్గానికే ముఖ్యమంత్రిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పార్లమెంటులో వర్గీకరణ బిల్లు రాబోతున్న సమయం లో మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎంపీలు ఒక్కరు కూడా లేకుండా చేసిన పుణ్యాత్ము డు రేవంత్ రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాదిగ లను దూరం చేసుకుంటే రాబోవు ప్రతి ఎన్నికల్లోనూ ఆ ప్రభావం కచ్చితంగా ఉంటుం దని అన్నారు. ప్రజావాణిలో ఇప్పటి వరకూ సమస్యలను ఒక్కటైనా పరిష్కరించారో లేదో చెప్పాలన్నారు. రాజకీయాల్లో కనీస నైతిక విలువలు లేకుండా రాణించలేమనే విషయాన్ని రేవంత్ రెడ్డి గ్రహించా లన్నారు.






