15 July, 2026 | 1:24 PM

Breaking News

ఢిల్లీకి బీఆర్ఎస్ పార్టీ బృందం.. కేంద్రమంత్రితో కేటీఆర్ ప్రత్యేక భేటీ   •   డీసీసీ అధ్యక్షులతో మీనాక్షి నటరాజన్ సమావేశం   •   'నా దీక్షను ఆపగలరు కానీ, పోరాటాన్ని కాదు'.. పోలీసుల పహారాలో ఇంట్లోనే దీక్ష   •   ప్రశాంత్ రెడ్డి గృహనిర్బంధం.. ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘనే: కేటీఆర్   •   కాచాపూర్‌లో గొర్రెలు, మేకలకు పీపీఆర్ టీకాల కార్యక్రమం   •   జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో రాయితీ ఇవ్వాలని వినతి   •   గుండెపోటుతో ఇల్లందు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవి నాయక్ మృతి   •   నిరంత నొప్పి, వాపును నిర్లక్ష్యం చేయకండి   •   శ్వాసనాళంలో చిక్కుకున్న ఈలను తొలగించిన వైద్యులు   •   జెడ్పీఎస్‌ఎస్‌ పాఠశాలలో గ్యాస్ లీక్‌తో మంటలు   •  

యూనిఫాం సకాలంలో అందించాలి

08-06-2024 01:49 AM

కలెక్టర్ నారాయణ రెడ్డి

వికారాబాద్, జూన్ 7 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫాం సకాలంలో అందించాలని కలెక్టర్ సీ నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో స్వయం సహాయక సంఘాల సభ్యులతో తయారు చేయించిన యూనిఫామ్స్‌ను అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా విద్యాధికారి రేణుకాదేవితో కలిసి పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. స్కూల్ యూనిఫామ్స్‌ను మహిళా సంఘాల సభ్యులు నాణ్యతతో తయారు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారిని అభినందించారు. యూనిఫామ్స్ 10వ తేదీలోపు అన్ని పాఠశాలలకు చేర్చాలని డీఈవోకు సూచించారు.