డ్రగ్స్, గంజాయి గురించి నిద్రలో ఆలోచించినా భయపడే పరిస్థితి కల్పిస్తాం
25-08-2024 03:26 PM
హైదరాబాద్: అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే రూ.2 లక్షల రుణమాఫీ చేసిన చరిత్ర మా ప్రభుత్వానిదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రైతు సంతోషంగా ఉన్నప్పుడే రాజ్యం సంతోషంగా ఉంటుందని సీఎం పేర్కొన్నారు. తమది రైతు ప్రభుత్వం అని నిరూపించుకోవడానికి రూ.2లక్షల రుణమాఫీ చేశామన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి గురించి నిద్రలో ఆలోచించినా భయపడే పరిస్థితి కల్పిస్తామని హెచ్చరించారు. డ్రగ్స్, గంజాయి మూలాలు ఏరివేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.






