17-01-2026 03:16:43 PM
హైదరాబాద్: మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) శనివారం పర్యటించారు. జడ్చర్ల మండలం చిట్టబోయినపల్లిలో ట్రిపుల్ ఐటీ నిర్మాణానికి సీఎం భూమి పూజ చేశారు. మహబూబ్ నగర్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణరావు, వాకిటి శ్రీహరి, దామోదర రాజనరసింహ, ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యేలు, అనురుథ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం జడ్చర్లలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు.