24-11-2025 12:19:35 PM
హైదరాబాద్: ఢిల్లీ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) హైదరాబాద్ కు బయలుదేరారు. జస్టిస్ సూర్యకాంత్ సోమవారం భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. సీజేఐ ప్రమాణస్వీకార కార్యక్రమానికి సీఎం రేవంత్ హాజరయ్యారు. సోమవారం సాయంత్రం కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. కొడంగల్ లో రూ. 10,300 కోట్లతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారు. సీఎం కొడంగల్ పర్యటన దృష్ట్యా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.