24-11-2025 03:04:07 PM
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్ ఉపఎన్నక పోరులో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై ఘన విజయం సాధించిన నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. జూబ్లీహిల్ నియోజకవర్గ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ నవంబర్ 26వ తేదీన ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ తో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. నవంబర్ 14న వెలువడిన ఎన్నిక ఫలితాల్లో నవీన్ యాదవ్ ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 24,729 ఓట్ల మెజార్టీతో నవీన్ యాదవ్ విజయం సాధించారు. ఈ ఉపఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్‌కు 98,988 ఓట్లు, బీఆర్ఎస్‌కు 74,259 ఓట్లు.. బీజేపీకి 17,061 ఓట్లు దక్కాయి. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాల్లో కాగా, నోటా నాల్గో స్థానంలో నిలిచింది.