కంటి పరీక్ష, శాస్త్ర చికిత్స శిబిరం విజయవంతం
జడ్చర్ల: లయన్స్ క్లబ్ ఆఫ్ జడ్చర్ల ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్ష, శస్త్రచికిత్స శిబిరము విజయవంతంగా నిర్వహించారు.ఈ శిబిరాన్ని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మహేంద్ర కుమార్ రెడ్డి, జడ్చర్ల మున్సిపల్ చైర్మన్ కోనేటి పుష్పలత, లయన్స్ క్లబ్ జడ్చర్ల చార్టర్ ప్రెసిడెంట్ డా.రామిరెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 600మందికి పైగా కంటిపరీక్షలు నిర్వహించడం జరిగింది.
దాదాపు 360 మందికి కళ్ళద్దాలు ఇవ్వడం ఇచ్చారు. 80మందికి శాస్త్ర చికిత్స ఈ వారం లోపు పూర్తి ఉచితంగా నిర్వహిస్తామని తెలియజేశారు.పై కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలియచేశారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ జడ్చర్ల అధ్యక్షులు ధ్రువ బాదిమి,సెక్రటరీ కాల్వ రామిరెడ్డి, కోశాధికారి కొండూరి వెంకటేష్ తో పాటు క్లబ్ సభ్యులు అందరూ పాల్గొన్నారు.




