24 February, 2026 | 9:45 PM

రాష్ట్ర వ్యాప్తంగా 120 నూతన అడ్వాన్స్ స్కిల్ సెంటర్లను ఏర్పాటు

24-02-2026 07:36 PM

తెలంగాణ విద్యార్థులను శిక్షన్ నైపుణ్యత లో ప్రపంచ స్థాయికి తీసుకెళ్తాం

కార్మిక శాఖ మంత్రి  వివేక్

షాద్‌నగర్,(విజయక్రాంతి): రాబోయే తెలంగాణలోని యువతను ఇప్పించి శిక్షణ నైపుణ్యం నేర్పించి అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతామని,ఇందుకు గా రాష్ట్రవ్యాప్తంగా120 నూతన అడ్వాన్స్ స్కిల్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి  గడ్డం వివేక్  తెలిపారు. ఈ సెంటర్ల ద్వారా నూతనంగా ఏర్పాటు చేయనున్న పరిశ్రమలకు నైపుణ్యం కలిగిన యువత సిద్ధంగా ఉంటుందన్నారు.

రంగారెడ్డి జిల్లా నందిగామ కన్హా శాంతి వనంలో  గత నాలుగు రోజులుగా జరుగుతున్న ఇండియా స్కిల్ రిజనల్ కాంపిటిషన్ 2025-26 ముగింపు ఉత్సవాలకు ముఖ్య అతిధిగా మంత్రి గడ్డం వేవేక్ వెంకట స్వామి హాజరయ్యారు.  ముగింపు ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి వివేక్ వెంకట స్వామి మాట్లాడుతూ.. యువత విద్యతో పాటు ఎదో ఒక కొత్త రంగంలో నైపుణ్యం పెంపోందించుకోవాలన్నారు. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఒక మంచి కాంపిటిషన్ ఏర్పటు చేశారన్నారు. 

ఈ కాంపిటిషన్ లో సౌత్ ఇండియాలోని 5 రాష్ట్రలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, రెండు కేంద్రపాలిత ప్రాంతాలు పూదుచేరి,లక్ష ద్వీప్ లకు చెందిన 300 మందికి పైగా పాల్గొన్నారు.  కాంపిటిషన్ లో గెలుపొందిన విద్యార్థులకు మెడల్స్ తో పాటు నగదు ప్రోత్సాహం అందజేశారు. గెలుపొందిన విద్యార్థులను త్వరలో జరగబోయే అంతర్జాతీయ కాంపిటిషన్లకు పంపనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.