calender_icon.png 12 February, 2026 | 6:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖర్గేతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ

12-02-2026 02:58:40 AM

  1. రాష్ట్రంలో తాజా పరిస్థితులు, ప్రభుత్వ పనితీరుపై చర్చ  
  2. సీఎం ఢిల్లీ టూర్‌పై నెలకొన్న ఆసక్తి

హైదరాబాద్, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హస్తిన పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్‌గా మారింది. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బుధవారం కొడంగల్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి శంషాబాద్ ఏయిర్‌పోర్టు వచ్చి ఢిల్లీకి చేరుకున్నారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయాలు, మున్సిపల్ ఎన్నికల తీరు, ప్రభుత్వ పనితీరును ఖర్గేకు వివరించినట్లుగా సమాచారం. అయితే ఢిల్లీ పర్యటలో భాగంగా రేవంత్‌రెడ్డి ఏఐసీసీ పెద్దలతో భేటీ కానుండటం..రాష్ట్ర కాంగ్రెస్‌లో ఆసక్తి రేపుతోంది.

ముఖ్యంగా పార్టీ సంస్థాగత నిర్మాణంతో పాటు మంత్రివర్గ విస్తరణపై చర్చించే అవకాశం ఉందనే టాక్ కూడా వినిపిస్తోంది. రాష్ర్టంలో ప్రభు త్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తికావడంతో పాటు క్యాబినెట్‌లో మరో బెర్త్‌ఖాళీగా ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో సరైన రీతిలో పనిచేయని మంత్రులపై చర్యలు తప్పవని సీఎం సీరియస్ వార్నింగ్ ఇచ్చారనే టాక్ ఇటీవల పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపించింది.

ఈ నేపథ్యంలో మంత్రి విస్తరణ మరోసారి ఉండబోతోందా? ప్రస్తుత మంత్రుల పనితీరు ఆధా రంగా క్యాబినెట్? లో మార్పులు చేర్పులు ఉండబోతున్నాయా అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. అంతేకాకుండా నామినేటెడ్ పోస్టుల భర్తీపైన చర్చించే అవకాశం ఉందని సమాచారం. ఖర్గేను కలిసి వారిలో సీఎం రేవంత్‌రెడ్డి, ఎంపీలు మల్లు రవి, అనిల్‌కుమార్‌యాదవ్, రఘువీర్‌రెడ్డి ఉన్నారు. 

నేడు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ 

రేవంత్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నది పరీవాహక ప్రాంతాల అభివద్ధి కోసం ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియ ను ప్రారంభించింది. ఇందుకు సంబంధించి ఇవాల తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్‌ను సైతం జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి గురువారం కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి నిధులు కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి సమస్యలపై కేంద్రం దష్టికి తీసుకెళ్లే చాన్స్ కనిపిస్తోంది. రైల్వే, ఎరువులు, -రసాయనాలు, జలవనరుల శాఖ మంత్రులను కూడా కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.