calender_icon.png 3 October, 2025 | 5:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాంరెడ్డి దామోదర్ రెడ్డి భౌతికకాయానికి సీఎం నివాళులు

03-10-2025 03:22:31 PM

హైదరాబాద్: మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి(Ramreddy Damodar Reddy) భౌతికకాయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నివాళులు అర్పించారు. దామోదర్ రెడ్డి కుటుంబ సభ్యులను రేవంత్ రెడ్డి పరామర్శించారు. రాంరెడ్డి దామోదర్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో వారి పార్దివ దేహానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivasa Reddy) కూడా నివాళులర్పించారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి (73) హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. దామోదర్ రెడ్డి ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. తన రాజకీయ జీవితంలో ఒకసారి మంత్రి పదవిని చేపట్టారు. ఆయన అసెంబ్లీలో తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించారు. ఆదివారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో రాంరెడ్డి దామోదర్ రెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి.