03-10-2025 03:08:24 PM
హైదరాబాద్: హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ(Bandaru Dattatraya) కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ‘అలయ్ బలయ్’(Alai Balai Program) ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం దసరా తర్వాత రోజున నిర్వహిస్తారు. దీనికి చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సుప్రీంకోర్టు రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వై.రమణ, బిజెపి ఎంపీలు లక్ష్మణ్, రఘునందన్ రావు, ఈటల రాజేందర్, ప్రముఖ సినీ నటులు నాగార్జున, బ్రహ్మానందం, ఎమ్మెల్యే సుజనా చౌదరి, సీపీఐ నేత నారాయణ, తెజస నేత ప్రొఫెసర్ కోదండరామ్, మాజీ ఎంపీ వీ.హనుమంతరావు, ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ తదితరులు పాల్గొన్నారు. దత్తాత్రేయ వారికి కండువాలు కప్పి స్వాగతం పలికారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాజకీయ నాయకుల మధ్య ఐక్యతను పెంపొందించడానికి దత్తాత్రేయ ఈ కార్యక్రమాన్ని 2005లో ప్రారంభించారు. తెలంగాణ సంస్కృతి, ఆహారపు అలవాట్లను ప్రదర్శించడానికి అలయ్ బలయ్ ప్రారంభించబడింది. ఈసారి ఆపరేషన్ సింధూర్ థీమ్ తో అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.