calender_icon.png 3 October, 2025 | 5:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వందే భారత్ రైలు ఢీకొని నలుగురు మృతి

03-10-2025 03:49:36 PM

పుర్నియా: బీహార్‌లోని పుర్నియా జిల్లాలో శుక్రవారం పట్టాలు దాటేందుకు ప్రయత్నిస్తూ వందే భారత్ రైలు(Vande Bharat train) ఢీకొనడంతో నలుగురు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. పాటలీపుత్ర స్టేషన్ కు వెళ్తున్న రైలు పూర్నియా జంక్షన్ సమీపంలో ఐదుగురు వ్యక్తులను ఢీకొట్టింది. ఇందులో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా, ఒకరు ఆసుపత్రిలో మరణించారు. ఒక వ్యక్తి పూర్నియాలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రి (GMCH)లో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటన శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. రైల్వే అధికారుల ప్రకారం, నార్త్ ఫ్రాంటియర్ రైల్వేస్ కస్బా-పూర్నియా జంక్షన్(Kasba - Purnia Junction) మధ్య ఉదయం 5 గంటల ప్రాంతంలో కస్బాలో దుర్గా పూజ ఉత్సవం నుండి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

మృతులు పూర్నియాలోని మఖానా ప్రాసెసింగ్ యూనిట్‌లో పనిచేస్తున్న కార్మికులుగా చెబుతున్నారు. ఈ సంఘటనను ధృవీకరిస్తూ, పూర్నియా రైల్వే జంక్షన్ స్టేషన్ సూపరింటెండెంట్ మున్నా కుమార్ మాట్లాడుతూ.. మదర్‌ఘాట్ సమీపంలో తెల్లవారుజామున వందే భారత్ వారిపైకి దూసుకెళ్లిందని పేర్కొన్నారు. ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించగా, ఒకరు జీఎంసీహెచ్ పూర్నియాలో చికిత్స పొందుతూ మరణించారు. మృతులందరూ 14 నుండి 15 సంవత్సరాల వయస్సు గలవారు. మృతుడు మాధేపురలోని మురళిగంజ్‌కు చెందినవాడు. మృతుల కుటుంబాలకు సమాచారం అందించామని, మృతదేహాలను పోస్టుమార్టం కోసం జీఎంసీహెచ్ పూర్నియాకు పంపామని పోలీసులు తెలిపారు.