5 June, 2026 | 6:06 PM

Breaking News

ఖానాపూర్లో కోర్టు నిర్మాణానికి స్థలం పరిశీలించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి   •   రైతు సేవలో ముందుండాలి   •   ప్రభుత్వ విప్ సహకారంతో కుల సంఘాల అభివృద్ధి కి ప్రత్యేక కృషి/సర్పంచ్ గండి నారాయణ   •   నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ జిల్లా ఎస్సీ వింగ్ అధ్యక్షులుగా పాల్ కరుణాకర్   •   గ్రామాలు పచ్చదనంతో నిండి పోవాలి: జిల్లా పంచాయతీ అధికారి   •   జంగం సంక్షేమానికి కృషి   •   రాజ్యసభ అభ్యర్థిగా ఖర్గే నామినేషన్ దాఖలు   •   పుప్పాల‌గూడ‌లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్‌   •   పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నీటి పారుదల రంగం నాశనం   •   “పెళ్లి వేడుకలో పచ్చని సంకల్పం… మొక్క నాటడంతో కొత్త జీవితానికి ఆరంభం”   •  

పాలమూరును కేసీఆర్‌ పట్టించుకోలేదు: సీఎం రేవంత్

05-06-2026 04:48 PM

పాలమూరు: మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రెండో రోజు పర్యటిస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను(Irrigation Projects) రేవంత్ రెడ్డి పరిశీలించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ... సాగునీరు, తాగునీటి ప్రాజెక్టులకు సబంధించిన క్షేత్రస్థాయి పర్యటన చేశానని పేర్కొన్నారు. ప్రాజెక్టుల పనులు పరిశీలించి భవిష్యత్ కార్యాచరణ తయారీకి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కష్టకాలంలో పాలమూరు నుంచి కేసీఆర్ ను ఎంపీగా గెలిపిస్తే అభివృద్ధి చేస్తారని ఆశించామని పేర్కొన్నారు.

కృష్ణా జలాలు పూర్తిగా జిల్లాల్లో ప్రవహించినా ఎన్నడూ ఒడిసి పట్టుకోలేదన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేస్తారని ఆశించామన్నారు. ప్రాజెక్టుల గురించి ప్రశ్నిస్తే అవాస్తవాలతో ప్రజలను మభ్యపెట్టే యత్నం చేశారని తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి పూర్తియితే 26 లక్షల ఎకరాలకు ఆయకట్టు వచ్చేదన్నారు. పాలమూరు-రంగారెడ్డికి రూ. 27 వేల కోట్లు ఖర్చుపెట్టి పంపులు, లిఫ్ట్ పనులు చేశారని చెప్పారు. పంపులు, లిఫ్ట్ పనులు చేపడితే కేసీఆర్ ఇంట్లో కనక వర్షం కురిసిందన్నారు. కమీషన్ల పేరిట రూ. వేల కోట్లు కొల్లగొట్టి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదని సీఎం ఆరోపించారు. మహబూబ్ నగర్  జిల్లాల్లో అన్ని ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయని సూచించారు.

ఏది ఎక్కడ ఉందో చూస్తోనికి రెండేళ్లు పట్టింది: సీఎం రేవంత్ 

ఏది ఎక్కడ ఉందో సరిచూసుకునేందుకే రెండేళ్లు పట్టిందని ముఖ్యమంత్రి తెలిపారు. తాము పనులు చేపడుతుంటే వాళ్లు రాజకీయ కార్యాచరణ చేపడుతున్నారని మండిపడ్డారు. మీరు పాపాలు చేయడమే కాదు.. కేసీఆర్ చేస్తుంటే చూడడం కూడా మహాపాపం అన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు చేసిన అప్పులకు రూ. 84 వేల కోట్లు చెల్లించారు. గత పాలనలో సాగునీటి ప్రాజెక్టులకు చేసిన అప్పులకు రూ. 52 వేల కోట్లు చెల్లించామన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులకు తాము వచ్చాక రూ. 22 వేల కోట్లు ఖర్చుచేశామని సీఎం వివరించారు. రూ. 22 వేల కోట్లలో రూ. 8 వేల కోట్లు పాలమూరు జిల్లా ప్రాజెక్టులకు ఇచ్చామన్నారు. జిల్లా నలుమూలలా తిరిగిన నేను ప్రాజెక్టులను కొలిక్కి తెచ్చే ప్రయత్నం చేస్తున్నానని వివరించారు. జిల్లాలో ప్రాజెక్టులు పూర్తి కావాలంటే 4 వేల ఎకరాలు భూసేకరణ చేయాలని తెలిపారు.

భూసేకరణ, ఆర్అండ్ ఆర్ చేయకుండా రిజర్వాయర్లతో నీళ్లు నింపగలమా? అని ప్రశ్నించారు. రెండేళ్లలో పనులు పూర్తి చేయాలని కంకణం కట్టుకుని ముందుకెళ్తున్నామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో విపరీతంగా అప్పులు తేవడం వల్ల ప్రాజెక్టులకు అప్పులు తెచ్చుకోలేని పరిస్థితి ఉందన్నారు. పాలమూరు ప్రాజెక్టుకు రూ. 55 వేల కోట్ల అంచనా వేసి రూ. 27 వేల కోట్లు ఖర్చు చేశారని సీఎం వివరించారు. 50 శాతం నిధులు ఖర్చుపెట్టకుండా 90 శాతం పనులెలా పూర్తవుతాయి? అన్నారు. ఉన్నదంతా దోచుకుని మమ్మల్ని దోషులుగా నిలబెడతామనే భ్రమలో ఉన్నారని సూచించారు. పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

ప్రాజెక్టులకు నిధుల కోసం పక్కా కార్యాచరణతో క్షేత్రస్థాయి పర్యటన చేస్తానని చెప్పారు. భూసేకరణకు సంబంధించి రూపాయి ఎక్కువైనా ఇచ్చి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. జిల్లా ప్రాజెక్టుల పూర్తికి సంపూర్ణంగా కట్టుబడి ఉన్నానని సీఎం హామీ ఇచ్చారు. తక్కువ భూసేకరణ ఉండి.. ఎక్కువ నీళ్లు నిల్వ చేసుకునే ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేస్తామన్నారు. కర్ణాటకతో సమన్వయం చేసుకుని ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. చెరి సగం ఖర్చు చేసిని మనం 70 శాతం నీళ్లు వాడుకునే అవకాశముందన్నారు. బ్రిడ్జ్ కమ్ బ్యారేజీల కోసం అధ్యయనం చేస్తున్నామన్నారు. ఆగిపోయిన రిజర్వాయర్ల పనుల పూర్తికి కార్యాచరణ చేపట్టామని సీఎం పేర్కొన్నారు. పనులకు అడ్డుపడకుండా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలను కోరారు.