గ్రామస్థాయి నుంచే పార్టీని బలోపేతం చేయాలి: ఎమ్మెల్యే కోరం
వర్షంలోనే ఎమ్మెల్యే ప్రసంగం
టేకులపల్లి, జులై 27, (విజయక్రాంతి): వర్షం కురుస్తున్నప్పటికీ కార్యక్రమాన్ని ఆపకుండా కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రసంగించారు. టేకులపల్లి మండల నూతన కాంగ్రెస్ అధ్యక్షుడిగా లక్కినేని శ్యామ్ నియామకాన్ని పురస్కరించుకుని సోమవారం పెగల్లపాడు గ్రామ పంచాయతీలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, గ్రామస్థాయిలో సంస్థాగత నిర్మాణం, ప్రజా సమస్యల పరిష్కారంలో కార్యకర్తలు చురుకుగా పనిచేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
సమావేశం మధ్యలో భారీ వర్షం ప్రారంభమైనా, కార్యక్రమాన్ని నిలిపివేయకుండా వర్షంలోనే ప్రసంగం కొనసాగించారు. కార్యకర్తలు, నాయకులు కూడా వర్షాన్ని లెక్కచేయకుండా అక్కడే ఉండి ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. అనంతరం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు లక్కినేని శ్యామ్ జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు కోరం సురేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాంబాబు, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కాలే ప్రసాద్, మాజీ మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వర్లు, పెగల్లపాడు సర్పంచ్ కోరం హనుమంతు, కొత్తతండా సర్పంచ్ అరుణ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.






