నా పదవీ కాలం ముగియబోతోంది: సీఎం రేవంత్ రెడ్డి
న్యూఢిల్లీ: పీసీసీ అధ్యక్షుడిగా తన పదవీ కాలం ముగియబోతోందని, పదవీ కాలం పూర్తయ్యేలోగా పీసీసీ అధ్యక్షుడిని నియమించాలని కోరానని రేవంత్ రెడ్డి తెలిపారు. పీసీసీ అధ్యక్షుడిగా మంచి విజయాలు సాధించానని చెప్పారు. జీవన్ రెడ్డి అనుభవాలను పార్టీ వినియోగించుకుంటుందన్నారు. జీవన్ రెడ్డి చర్యల వల్ల కాంగ్రెస్ కు నష్టం జరగాలని చూశారని చెప్పారు. కాంగ్రెస్ పట్ల జీవన్ రెడ్డికి ఉన్న నిబద్ధత వారికి అర్థం కాదన్నారు. నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నామని సీఎం పేర్కొన్నారు.
ఆరు సంక్షేమ పథకాలను అమలు చేయడమే ధ్యేయంగా ముందుకెళ్తామని పేర్కొన్నారు. ఏకకాలంలో రైతు రుణమాఫీ చేయడానికి నిర్ణయించామని సీఎం తెలిపారు. రాష్ట్రంలో సజావుగా ఎన్నికలు నిర్వహించామని, ఏపీలో 40-50 మంది అధికారులను తొలగించాల్సి వచ్చిందన్నారు. ఎన్నికల నిర్వహణపై కేంద్రం కూడా ఆరోపణలు చేయలేదని తెలిపారు. ఎన్నికల నిర్వహణపై రాజకీయ ప్రత్యర్థులూ ఆరోపణలు చేయలేకపోయారన్నారు. రాష్ట్రంలో రాజకీయ ప్రేరేపితమైన కేసులు ఒక్కటీ పెట్టలేదని సీఎం స్పష్టం చేశారు.






